
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోరారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు.
ఎస్‌వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నెం: 155257 సంప్రదించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని కోరారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు , అనధికారిక వ్యక్తులు బుకింగ్‌ల పేరుతో సంప్రదించినట్లయితే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 98668 98630 సమాచారం అందించాలని కోరారు




