
0views
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా జూలై 21న తిరుమంజనం, అంకురార్పణ, 22న ధ్వజారోహణంతో పాటు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. 28న శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.




