
320views
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ తెలిపింది. నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల412 మంది భక్తులు దర్శించుకోగా, 27,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 27 లక్షలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
Source: Velugu





