News

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!

236views

లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి యూపీ రాజధాని దుబగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ కుంజ్ సెక్టార్ హెచ్‌లో చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న నిధిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ, ఆమె మరణించింది.

నిందితుడు మొహమ్మద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అదనపు డీసీపీ(పశ్చిమ) సీఎన్ సిన్హా హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టి)కి తెలిపారు. బాలిక తల్లి దుబగ్గ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు హత్య, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన తగిన సెక్షన్ల కింద సూఫియాన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

నిధి హైస్కూల్ వరకు మాత్రమే చదువుకుంది. సమీపంలోని బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా నేర్చుకుంది. సుఫియాన్ అదే పరిసరాల్లో ఉంటూ కొంతకాలంగా ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం, అతను నిధికి మొబైల్‌ను ‘బహుమతి’గా ఇచ్చాడు. ఆమెకు కాల్ చేయడం ప్రారంభించాడు. ఆమెను మతం మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. అతడి వేధింపుల గురించి చెప్పింది.

ఆమె తల్లి, ఇతర బంధువులు సుఫియాన్ ఇంటికి వెళ్ళి అతని ప్రవర్తనపై అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఇంట్లో వాగ్వాదం జరుగుతుండగా, సూఫియాన్ అకస్మాత్తుగా నిధిని పట్టుకుని నాలుగో అంతస్తుకు తీసుకెళ్ళి కిందకు నెట్టాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి