
376views
పతనంతిట్ట: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26న ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు.
Source: EtvBharat





