
423views
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందూ ఆలయ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వం నిలిపివేయడంపై వాల్మీకి సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది 70-80 ఏళ్ళ నాటి వాల్మీకి ఆలయమని భక్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. హిందువులపై పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి చేస్తున్న వివక్ష, అణచివేత చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయని భక్తులు నిరసన ప్రదర్శన చేశారు.
ఈ నెల ఎనిమిదోతేదీన లర్కానా (సింధ్, పాకిస్తాన్)లోని పాత ఘస్పిడి ప్రాంతంలోని స్థానికులు ఊరేగింపు చేపట్టారు. తమ కమ్యూనిటీ పట్ల ఈ ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా పాక్‌లో 100 కంటే తక్కువ కుటుంబాలు మిగిలి ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వికృత చర్యల వల్ల రేపటి(అక్టోబర్ 9) వచ్చే తమ పండుగను జరుపుకోలేమని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





