
290views
న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతున్న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్ళలో యావత్ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్టు పేర్కొన్నాయి.
Source: EtvBharat





