
372views
మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ఆమె ప్రారంభించారు.
చరిత్ర, జానపద కథలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, మానవ పాత్రల పండుగలు భారతదేశం అంతటా జరుపుకుంటారని, మైసూరులో దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన వేడుక అని ముర్ము ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని పలు ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు కర్ణాటకలో ఉన్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు.
Source: Nijamtoday





