314
-
నగరంలో భారీ శోభాయాత్ర
నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో ఊరేగింపు కన్నులవిందుగా నిర్వహించారు. దసరా పర్వదినాల్లో రోజుకు రెండు అలంకారాలు చొప్పున పద్దెనిమిది శక్తిపీఠాల్లోని అమ్మవార్ల అలంకారాలు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.