
1.3kviews
భాగ్యనగరం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నట్టు వెల్లడి కావడం పట్ల పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరి నాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం భద్రతను విస్మరించి, ఉగ్రవాదులకు, అరచకత్వానికి బాటలు వేస్తోందని స్పష్టమైన్నట్టు వారు మండిపడ్డారు. ప్రస్తుతం చేసిన సోదాలతో సరిపెట్టకుండా, రాష్ట్రాన్ని మొత్తం జల్లెడ పట్టి ఉగ్ర మూలాలను పెకిలించాలని బాధ్యులను, వారికి సహకరిస్తున్న మద్దతుదారులను శిక్షించాలని ఎన్ఐఎను కోరారు.
Source: Nijamtoday





