News

కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు లోన్‌యాప్ నిందితులు

354views

విజ‌య‌వాడ‌: లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ లోన్​యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాలతో ఏర్పాటుచేసిన బృందం ఇతర రాష్ట్రాలకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. ఈ కేసులతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాలకి చెందిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి