News

దేశం కోసం 24 గంటలు

735views

* విజయవంతమైన RSS ప్రత్యేక కార్యక్రమం

స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని కర్నూలు, నంద్యాల జిల్లాల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఉన్న సంఘ కార్యకర్తలు ఆ రెండు జిల్లాలలోని అన్ని గ్రామాలలో 11 సెప్టెంబర్ 2022, ఆదివారం నాడు ‘దేశం కోసం 24 గంటలు’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమంలో దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను భావితరం మరచిపోకుండా వారిని, వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని, వారి సమర్పిత జీవితాలకు పుష్పాంజలి ఘటించే ఒక కార్యక్రమాన్ని (భారతమాత పూజ) జరపాలని, ఆ క్రమంలో గృహసంపర్కం, భారతమాత పూజా కార్యక్రమాలను నిర్వహించాలని తలపోశారు.

ఆ కార్యక్రమాన్ని క్రింది విధంగా యోజన చేశారు…..

1.ముందుగా నియుక్తి చేసిన గ్రామానికి విస్తారక్ ముందు రోజు (10 సెప్టెంబరు) రాత్రికి చేరుకోవాలి.

2.అక్కడ ప్రతీ గ్రామానికి 100 స్టిక్కర్లు, 100 కరపత్రాలు ఒక A4 సైజు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో… ఇలా ఒక కిట్ పంపడం జరిగినది.

3. గృహ సంపర్కం: అలా వెళ్ళిన విస్తారక్ ఒక గ్రామంలో 100 గృహాలను ఈ ప్రచార సామగ్రి ద్వారా సంపర్కం చేయాలి.

4. అందజేసే సమయంలో వారందరినీ సా.4.00 గం.ల సమయంలో ఏదైనా గుడిలోగానీ, బడిలో గానీ, సెంటర్ లో గానీ కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానించడం. వస్తూ వస్తూ వారి ఇంట్లో వుండే పూలను వెంట తీసుకు రమ్మనడం.

5. భారతమాత పూజా కార్యక్రమం: అలా వచ్చిన వారందరి చేత గ్రామానికి ఇవ్వబడిన 44 సైజు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ముందు వారు తీసుకు వచ్చిన/ మనం ఏర్పాటుచేసిన పుష్పాల తోటి వారికి అంజలి ఘటించమని చెప్పడం.

6.వారందరికీ చిన్న సందేశాన్ని ఇవ్వడం లేదా మన దగ్గర వున్న కరపత్రంలో వున్న విషయాన్ని చదివి. వినిపించడం.

7.ఆ గ్రామంలో గనుక ఎవరైనా స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నట్లయితే వారిని సత్కరించడం.,

8. చివరలో అందరి చేత సామూహికంగా వందేమాతరం చెప్పించడం..

9. ఈ కార్యక్రమంలో మనతో పాటు తిరిగి బాగా స్పందించిన వారి పేర్లు, చిరునామా వివరాలను సేకరించడం.

జరిగినది:

1. విభాగ్ లో వున్న జిల్లా కేంద్రాలనుంచి, నగర, ఖండ కేంద్రాలనుంచి విస్తారకులు యోజన చేసిన 914. గ్రామాలకు గాను 598 గ్రామాలకు ముందు రోజు రాత్రికే చేరుకున్నారు.

2. ముందురోజు నాటికే అన్నీ గ్రామాలకూ ప్రచార సామగ్రిని కార్యకర్తలు అందజేశారు. విస్తారకులు వెళ్ళలేని కొన్ని గ్రామాలలో స్థానిక కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగినది.

3. ఈ విధంగా మొత్తం 914 గ్రామాలకు గాను 802 గ్రామాలలో ఈ ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.

4. గ్రామాలలో గృహసంపర్కం చేసే సమయంలో విస్తారకులతో పాటు స్థానిక కార్యకర్తలు, గ్రామంలో వుండే జాతీయ భావాలు కల్గిన యువకులు, పెద్దలు కలిపి మరొక 2153 మంది కార్యకర్తలు పనిచేశారు.

5. ఆవిధంగా మొత్తం ఈ కార్యక్రమంలో 2751 మంది భాగస్వాములయ్యారు.

6. సంపర్కం చేసిన గృహాల సంఖ్య – 74943.

7. సంపర్కం చేసిన గ్రామాలలో అందజేసిన కరపత్రాలు, స్టిక్కర్ల సంఖ్య 92,500.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.