
566views
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని శ్రీ జైనం మానస్ భవన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. సమావేశాన్ని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బాలే జీ భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. 36 సంస్థల అఖిల భారత ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

ఈ సమావేశంలో ప్రస్తుత జాతీయ, సామాజిక దృశ్యం, విద్య, సేవా, ఆర్థిక, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. గో సేవ, గ్రామాభివృద్ధి, పర్యావరణం, కుటుంబ ప్రబోదం, సామాజిక సామరస్యం తదితర అంశాలను ముందుకు తీసుకెళ్లడంపై కూడా చర్చలు జరగనున్నాయి. సంస్థ విస్తరణ, ప్రత్యేక ప్రయోగాల గురించి కూడా చర్చిస్తారు.
Source: VSKBharat





