News

అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు

349views

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను, చినూక్‌ హెలిక్యాప్టర్ల వంటి వాటిని సత్వరం తరలించవచ్చన్నారు.

అన్ని స్థావరాలను ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్కుతో అనుసంధానం చేస్తామని, వీటన్నింటికీ ప్రత్యేక ఉపగ్రహ టెర్మినళ్ళు ఉంటాయని తెలిపారు. ఈ చర్యలు ఎల్‌ఏసీ వెంట నిఘాను బలోపేతం చేస్తాయన్నారు. ‘తూర్పు సెక్టారులోని ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము పెద్దపీట వేస్తున్నాం’ అని బ్రిగేడియర్‌ టి.ఎం.సిన్హా సరిహద్దు పర్యటనకు వచ్చిన మీడియా బృందానికి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి