Newsvideos

నిజాలు తెలుసుకుందాం – ఆయుష్ నడింపల్లి

457views

హైదరాబాద్ ఖైరతాబాద్ లో గల విశ్వేశ్వరయ్య భవన్ లో ‘నేషనలిస్ట్ హబ్’ ఛానల్ ఆధ్వర్యంలో ‘స్వరాజ్య నుంచి సురాజ్య వరకు’ (SWARAJYA TO SURAJYA) అనే పేరుతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేకమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

ఆంగ్లేయులు భారతీయుల విద్యా వ్యవస్థను, మెదళ్లను, ఆలోచనలను, జీవన శైలిని ఏ విధంగా కలుషితం చేశారు? ఎంత సుదీర్ఘమైన ఆలోచనతో, వ్యూహంతో భారతీయులను వారికి బానిసలుగా మార్చుకున్నారో వారు తమ ప్రసంగాలలో వివరించారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక) ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయుష్ నడింపల్లి, భారతీయుల హృదయాలను కలుషితం చెయ్యడంలో మీడియా పాత్రపై ప్రసంగించారు. చరిత్రను, వర్తమానాన్ని విశ్లేషించి మనమందరం నిజాలనున్ గ్రహించాలని శ్రీ ఆయుష్ తెలిపారు. ఈ క్రింది వీడియోలోని వారి ప్రసంగాన్ని చివరిదాకా వీక్షిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.