
367views
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. ఆయనే రాజా కార్తికేయ గుండు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. రాజా కార్తికేయ భారతీయ విద్యా భవన్, నిజాం కళాశాలలో విద్యను అభ్యసించారు. ఐఐఎఫ్టీ ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి 2007-2009లో (మాస్టర్ ఆఫ్ ఫారిన్ సర్వీస్)ను పూర్తి చేశారు.





