
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో సాగుతున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా ఎనిమిది శాతానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రపంచస్థాయి అంతరిక్ష ఆర్థిక రంగంలో భారత్ వాటా కేవలం రెండు శాతంగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఇస్రో పలు రకాలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు దిగడం, విదేశీ శాటిలైట్లను కక్షల్లోకి పంపించడం వంటి పరిణామాలతో, ఇందుకు ప్రైవేటు రంగ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ స్థాయిలో అంతరిక్ష వ్యాపార ఆర్థిక వ్యవస్థల పోటీలో ప్రైవేటు రంగ తోడ్పాటుకు ఉన్న ప్రతిబంధకాలను తొలిగించుకునేందుకు ఇస్రో అన్ని యత్నాలకు దిగింది. ఈ క్రమంలో త్వరలోనే నూతన స్పేస్ పాలసీ అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు రంగ సంస్థలను విరివిగా అంతరిక్ష బిజినెస్‌లోకి తీసుకురావడం వల్లనే త్వరిగతగతిన నిర్ణీత లక్షాల మేరకు స్పేస్ ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఇస్రో భావిస్తోంది.
Source: Nijamtoday





