News

క‌శ్మీర్‌లో వరుస భూకంపాలు

211views

క‌శ్మీర్‌: రెండు రోజులుగా వరుస భూకంపాలతో జమ్ముకశ్మీర్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే, వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

జమ్ము ప్రాంతంలోని కట్​డా ప్రాంతానికి ఈశాన్యంగా 62 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాత్రి 11.04 గంటలకు.. 4.1 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే 11.52 గంటలకు 3.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఆగస్టు 23న వరుసగా ఆరు సార్లు భూమి కంపించి.. కశ్మీర్​ను కుదిపేసింది. వీటి వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని కట్​డా, డోడా, ఉధంపుర్​, కిశ్త్వాడ్​ జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి