
414views
తిరుపతి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు.
టీటీడీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందని అన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపైన దృష్టి సారించాలని సూచించారు.





