News

ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత‌!

156views

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ ఉరీ​ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం, బారాముల్లా పోలీసులు కలిసి హతమార్చారు. ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం, పోలీసు దళాలు గస్తీ నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. మదియన్​ నానక్​ పోస్ట్​ సమీపంలోని కంచెను దాటి వారంతా భారత భూభాగంలోకి చొరబడుతున్నారని భద్రతా సిబ్బంది గుర్తించారు. వారిని నిలువరించడానికి కాల్పులు జరిపగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి