News

ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌

432views

న్యూఢిల్లీ: ‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్డ్‌’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే పైలట్‌ ప్రాజెక్ట్‌గా రోజూ సగటున 30 వేల మంది వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలను విక్రయిస్తోంది. ఈ స్టాల్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో మిగిలిన 90 స్టేషన్లలో కూడా దశలవారీగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో సెప్టెంబరు 20 నాటికి 20 స్టేషన్లలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 10 స్టేషన్లలో ఇప్పటికే స్టాల్స్‌ ఏర్పాటు పూర్తయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి