News

సరిహద్దుల్లో మారణాయుధాలు స్వాధీనం

429views

పంజాబ్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్‌ మెషీన్‌ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం 10 మేగజీన్లున్న ప్యాకెట్లు ఒక పొలంలో పడి ఉండగా గుర్తించినట్టు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. వీటిని పాకిస్తాన్‌ నుంచి తెచ్చారని భావిస్తోంది. మారణాయుధాలను సకాలంలో గుర్తించి సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా నివారించగలిగామని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి