News

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

346views

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు.

ఎనిమిదేళ్ళ‌ పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్ళేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్ళారని సంజయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి