News

తైవాన్‌లో చైనా అరాచకం!

387views

న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్‌ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్‌ లీ–సింగ్‌ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది.

‘నేషనల్‌ చుంగ్‌–షాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్‌ హోదాలో ఔ యాంగ్‌ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్‌ ట్రిప్‌పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్‌ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి