News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

393views

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది.

టోంక్ జిల్లాకు చెందిన కేసర్ మసూద్ , సవాయ్ మాధోపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న అసద్ పఠాన్‌లను అరెస్ట్ చేసింది. పోలీసులతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. వీరిద్దరూ ఏదైనా భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్నారా? విదేశాల్లోని ఉగ్రవాదుల ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారా? వంటి అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి