News

ఉగ్ర కాల్పుల‌కు బ‌లైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం

248views

ముంబై: బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ కశ్మీరీ గాయకురాలి జీవితం ఆధారంగా ఈ ఇది పట్టాలెక్కనుంది. నిర్మాత ఫిరోజ్‌ నడియాద్‌వాలా తెరకెక్కించనున్నట్టు సమాచారం. మరోవైపు కంగనా ‘ఎమర్జెన్సీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అందులో తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి