News

పింగ‌ళి పేరిట త‌పాల స్టాంప్.. కిషన్‌రెడ్డి వెల్ల‌డి

486views

విజ‌య‌వాడ‌: పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన అసలు జాతీయ జెండాని ఆగ‌స్టు రెండోతేదీన‌ ప్ర‌ద‌ర్శిస్తామ‌ని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిష‌న్ రెడ్డి విజయవాడలో తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకల సందర్భంగా 2న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఆదివారం ఆయన పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. శత జయంతి వేడుకలకు పింగళి కుటుంబ‌ సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్టు, పింగళి పేరిట తపాల స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.

అదేవిధంగా పింగళి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ, అమిత్‌ షా సన్మానిస్తారని ఆయన వివరించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా పేరిట వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశంలోని ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి