News

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు

422views
  • అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ

విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

‘భారతదేశ భద్రతలో ఈశాన్య రాష్ట్రాల వ్యూహాత్మక అభివృద్ధి ప్రాధాన్యం’ అనే అంశంపై ప్రసంగించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రధాని మోదీ చొరవతో పలు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.

టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంతో అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనా సరిహద్దు వచ్చినట్లయిందన్నారు. స‌రిహద్దుల్లో ఒకప్పుడు తాత్కాలిక నిర్మాణాలే ఉండేవని, ప్రస్తుతం యుద్ధాల్ని తట్టుకునే పక్కా నిర్మాణాలు, రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

చైనా దుందుడుకు చర్యలకు దీటుగా మనం సమాధానం ఇస్తున్నామని వెల్లడించారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ లాంటి సినిమాలు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బాగా హిట్‌ అయ్యాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి అభివృద్ధిని వేగవంతం చేశామన్నారు. ‘ఉడాన్‌’ పథకం కింద పౌర విమానయాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి