
-
1070 నిత్యావసర కిట్లు పంపిణీ
రాజమహేంద్రవరం: గోదావరి వరద బాధితులకు సేవాభారతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ చేయూత అందిస్తోంది. వర్షాలు, ఇతర ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తడంతో నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో నదీ తీరప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్కడి ప్రజలు అష్టకష్టాల్లో చిక్కుకున్నారు.


ఎన్నో కుటుంబాలు నిరాశ్రులయ్యాయి. ఇళ్ళల్లో బురద మట్టి మేట వేసింది. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉన్నది. కొన్నిచోట్ల ఇళ్ళు వరద నీటికి నానిపోవడంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మరికొంతమంది సమీపంలోని రోడ్డుపై గుడారాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి తన సేవా దృక్ఫథాన్ని చాటుకుంటోంది.
జిల్లాలో చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలలోని మురుమురు, చిన పోలిపాక, పెద పూలిపాక, గన్నవరం, టేకుబాక, పాత వెంకటాయపాలెం, పొట్లవారి గూడెం, భీమవరం, చుచిరేవులగుడెం, కూనవరంలతోపాటు మరో పది పల్లెల్లో ప్రజలకు 1070 నిత్యావసర కిట్లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో వంతెన రామచంద్ర రాజు, మా. నీ. విభా సంఘ్ చాలక్ మట్టపర్తి మురళీకృష్ణ, విభాగ్ సహా కార్యవాహ, స్వయంసేవకులు పాల్గొన్నారు.





