
నరసరావుపేట: ఏపీలోని పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ స్థానిక భక్తుల సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


అర్చకుడు పరాంకుశం రంగనాధాచార్యులు సుమారు 200 మంది దంపతులచే, వేలమంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికి వాసవి మార్కెట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి వీహెచ్‌పీ ప్రాంత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ టి. శివశంకర్ పాల్గొని, పరిషత్ ముఖ్య ఉద్దేశాలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) పల్నాడు జిల్లా సంఘచాలక్ మాన్యశ్రీ కొత్త వెంకట రామకృష్ణ ఈ కల్యాణోత్సవం జరిపేందుకు గల కారణాలను భక్తులకు వివరించారు. భగవంతుడిని నవవిధాలుగా పూజించవచ్చని తెలిపారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.





