News

మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!

291views

న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళ‌పై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.

ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో ఉన్నాడు. మిగిలిన ఇద్దరు నిందితులు సనావుల్లా, ముస్తఖీంలు పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు గురువారం సోదాలు జరిపారు.

2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేస్తామని, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకోవాలని ఈ ముగ్గురు నిందితులు కుట్ర పన్నినట్లు బీహార్ పోలీసులు చెప్పారు.

పాట్నా ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ ఉగ్ర కుట్ర కేసులో 26 మంది అనుమానిత ఉగ్రవాదులపై కేసు నమోదు చేశామని, వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు.

ఈ నెల‌ 14వతేదీన బయటపడిన ఉగ్ర దాడి కుట్ర కేసులో జార్ఖండు రాష్ట్రానికి చెందిన రిటైర్డు పోలీసు అధికారి అథర్ పర్వేజ్, ముహ్మద్ జలాలుద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి