
421views
బెంగళూరు: బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పౌల్ట్రీ షాప్ యజమాని అయిన ప్రవీణ్‌పై మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దాడి జరిగింది. ఇద్దరు దుండగులు.. పదునైన ఆయుధాలతో బీజేపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. ప్రవీణ్ హత్యపై దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.





