News

భారతదేశం ప్రాచీన కాలం నుండి విజ్ఞాన దేవాలయం

463views
  • ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలె

పూణే: భారతదేశం ప్రాచీన కాలం నుంచి విజ్ఞాన దేవాలయంగా ఉందని రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ కార్య‌వాహ‌ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఇప్పుడు యువత మళ్ళీ ఉపాధ్యాయులుగా మారి ప్రపంచమంతటా ప‌ర్య‌టించి నాగరికంగా మార్చాల‌ని కోరారు.

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కెరీర్ కోర్సుల (ఐఎంసిసి) నూతన భవనాన్ని దత్తాత్రేయ హోసబాలే బుధవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రసంగించారు.

నేను విద్యా రంగ సంస్థలకు వెళుతూనే ఉంటానని, తరచూ దేశ విదేశాల్లోని సంస్థలను సందర్శించడానికి సమయాన్ని వెచ్చిస్తుంటాన‌ని హోస‌బాలే తెలిపారు. కొత్త నాయకత్వాన్ని అందించే యువతులు ఇక్కడి నుంచి బయటకు రావడంతో ఆనందం ఉంటుంద‌ని, ప్రపంచ విద్యా పటంలో పూణేకు భిన్నమైన స్థానం ఉంద‌ని పేర్కొన్నారు. పూణే ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది… పూణేలో గొప్ప సాంస్కృతిక వాతావరణం ఉంది…. ఇక్కడ ఉంటూ, విద్యార్థులు డిగ్రీలు పొందుతూ గొప్ప వ్య‌క్తులుగా త‌యార‌వుతున్నార‌న్నారు.

భారతదేశంలో విద్యాసంప్రదాయం అనాదిగా వస్తున్నదని, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని హోస‌బాలే తెలిపారు. భారతదేశంలో విద్య కొందరికే పరిమితమైందని చెప్పడం వక్రీకరించిన చరిత్రకు ఉదాహరణని, నేడు 130 కోట్ల మంది దేశప్రజలు నూతన విద్యావిధానం అమలుతో బంగారు దశకు చేరుకున్నారన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి