
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అరెస్టు చేసిన పాకిస్తానీ జాతీయుడిని విచారిస్తోంది.
ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్ కోట్ సరిహద్దు ఔట్‌పోస్టు దగ్గర నుంచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు. పెట్రోలింగ్ బృందానికి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు… వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు… అని పేర్కొన్నారు.
“అతని వద్ద నుండి 11 అంగుళాల పొడవైన కత్తి, మతపరమైన పుస్తకాలు, బట్టలు, ఆహారం, ఇసుకను మేము కనుగొన్నాము. అతను పాకిస్తాన్‌లోని ఉత్తర పంజాబ్‌లో ఉన్న మండి బహౌద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్‌గా గుర్తించబడ్డాడు, ”అని ఆ అధికారి వివరించారు.
ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నూపుర్ శర్మను హతమార్చేందుకు తాను సరిహద్దు దాటినట్టు ప్రాథమిక విచారణలో అనుమానితుడు తెలిపాడని అధికారి తెలిపారు. అతను తన ప్రణాళికను అమలు చేయడానికి ముందు అజ్మీర్ దర్గాను సందర్శించాలని అనుకున్నాడు.
“మేము తదుపరి విచారణ కోసం అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించాము. అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అక్కడ నుండి ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేము అతని గురించి సంబంధిత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాము, ”అన్నారాయన.
Source: Organiser