News

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..

418views

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయా పిటిషన్​దారులు దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది.

పెండింగ్​ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు చెప్పింది సుప్రీం. అగ్నిపథ్​పై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్​లను కూడా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి