
523views
కశ్మీర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై ఉగ్ర దాడి జరిగింది. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని నాకా పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





