
425views
-
నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.. గత 14 రోజులుగా కనిపించడం లేదు. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక కార్మికుడు శవమై కనిపించాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించాడు కాంట్రాక్టర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





