
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మహిళలపై క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వివక్షతను మరింత తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా, మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్ళను పంపాలని ఆదేశించింది.
మతాచారాల ప్రకారం స్త్రీల బహిరంగ సంచారం, సామాజికతపై కట్టడి దిశలో తాలిబన్లు పలు కఠిన చర్యలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ దశలో ఉద్యోగినులు ఉద్యోగాలు వీడాలనే పరోక్ష ఆదేశాలు వెలువరించారు. ఉద్యోగినులు తమ సమీప బంధువులైన మగవారిని తమ బదులు ఉద్యోగాలకు పంపించాలని ఫర్మానాలో తెలిపారు.
తనకు తాలిబన్ల నుంచి అటువంటి ఆదేశాలు అందాయని దేశంలోని మహిళా ఉద్యోగి ఒకరు వార్తా సంస్థలకు తెలిపారు. స్త్రీలు పని ఒత్తిడిని తట్టుకోలేరు. వీరి బదులు మగవారిని ఉద్యోగాలకు తీసుకుంటామని, కుటుంబ జీవనాధారం పోకుండా ఉండాలంటే ఉద్యోగినులు తమ ఇంటి మగవారిని పంపించి డ్యూటీలు చేయించాలని ఆదేశాలలో తెలిపారు.
Source: Nijamtoday





