News

భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిప‌డ్డ బీజేపీ

414views

న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. ఆ జర్నలిస్టును తానెన్నడూ కలవడం, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు.

నుస్రత్‌ మీర్జా అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్‌లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి