
-
హిందూ యువతిని ట్రాప్ చేసి, బ్లేడ్‌తో గాయపరచుకోమన్న మోసగాడు
గాంధీనగర్: గుజరాత్‌కు చెందిన ఓ క్రైస్తవుడు సంపన్న హిందూ యువతిని లవ్ జిహాద్ తరహాలో ట్రాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. బ్లేడ్‌తో తనను తాను గాయపరచుకోమన్నాడు. ఇష్టం లేకున్న మాంసం తిన్నమన్నాడు. ఎట్టకేలకు ఈ ఘటనలను కుటుంబ సభ్యులు తెలుసుకుని యువతిని రక్షించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, క్రైస్తవ పోలీసులు కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తండ్రి ప్రధాని కార్యాలయాన్ని ఆశ్రయించిన తర్వాత మాత్రమే యువతికి రక్షణ లభించింది.
సెల్విన్ పాల్ పర్మార్ అనే క్రిస్టియన్ సంపన్న కుటుంబానికి చెందిన హిందూ అమ్మాయిని ప్రేమ పేరిట ట్రాప్ చేశాడు. తనకు రూ. 250 కోట్ల ఆస్తి ఉందని, ఫ్యాక్టరీ, ఇసుక లీజులు, పెట్రోల్ పంపులు మొదలైనవాటిని కలిగి ఉన్నానని, 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యానని అబద్ధాలు చెప్పాడు. వీటిని వడోదరలోని ఛని కెనాల్ సమీపంలోని ఓ సొసైటీకి చెందిన 23 ఏళ్ళ యువతి నమ్మేసింది.
కుటుంబ సభ్యుల వేధింపులు
రెండేళ్ళ సంబంధం తర్వాత, అతను 2019లో ఆమెను కోర్టులో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలను తీసి, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. సెల్విన్ తండ్రి పాల్ పర్మార్ ఆమెను తమ ఇంట్లో నివసించమని బలవంతం చేశాడు. ఇంకా.. వారిద్దరూ సెల్విన్ సోదరి శ్వేతతో కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆమెను ఇంట్లో బంధించి, ఇష్టం లేకున్నా మాంసాహారం తినాలని ఒత్తిడి తెచ్చారు.

బాలికపై జరిగిన వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆమెను తిరిగి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆమె మొబైల్‌ను తనిఖీ చేసి, ఆ వ్యక్తితో చాట్‌లను చూశారు. అక్కడ అతను బ్లేడ్‌తో ఆమె శరీరంలో 40 నుండి 45 కోతలు కోసుకోమని కోరాడు. ఒక నిమిషంలో పనిని పూర్తి చేసి, అదే చిత్రాలను పంపాలని అతను కోరాడు.
పోలీసుల లంచం డిమాండ్
దిగ్భ్రాంతికి గురైన యువతి తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని షీ టీమ్‌ను ఆగస్ట్ 2021లో సంప్రదించారు. అయితే ఆ కాల్‌ను స్వీకరించిన పోలీసు అధికారి నోయెల్ సోలంకి వారి ఆందోళనను పట్టించుకోకుండా లంచం డిమాండ్ చేశారు. వారు షీ టీమ్‌లో భాగం కానప్పటికీ వారిని బెదిరించేందుకు మరో పోలీసు అధికారి సంజయ్ కుమార్‌తో కలిసి వారి ఇంటికి వెళ్ళి కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నించారు.
పోలీసులను సస్పెన్షన్
సెల్విన్, నోయెల్ ఒకే మతానికి చెందిన వారు కావడంతో కేసు మాఫీ జరిగే పరిస్థితి ఉందని బాధితురాలి తండ్రి.. వారిపై 2021 సెప్టెంబర్‌లో ఛని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అతను పీఎం కార్యాలయానికి కూడా లేఖ రాశాడు. . పీఎంఓ ఆదేశాల మేరకు వారిని విచారించగా, ఆరోపణలు నిజమని తేలడంతో జూలై 22న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఇంతలో యువతకు వైద్యపరీక్షలు నిర్వహించగా, ఆమె శరీరంపై 500 బ్లేడ్ కోత గాయాలు ఉన్నాయని తేలింది. ఆ గాయాలను దాచడానికి ఆమె పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించేది.
Source: HINDU POST





