News

ఐరాస భద్రతా మండలిలో త్వరలో భార‌త్‌కు శాశ్వత సభ్యత్వం

388views

న్యూఢిల్లీ: ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాత్రం చోటు లభించడం లేదు. ఇందుకు ఎన్నో ఏళ్ళుగా కృషి జరుగుతున్నా.. కేవలం తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా మరో ఏడాదిలోనే (2023 నాటికి) భారత్‌ నిలువనుందని ఐరాస నివేదిక వెల్లడించింది. దీని ఫలితాలు ఎలా ఉన్నా.. తాజా పరిణామం మాత్రం భారత్‌కు కలిసి వచ్చేదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలాన్ని ఇస్తుందని ఐరాసలో కీలక స్థానంలో ఉన్న అధికారులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి