News

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక

185views

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్ పాపులేషన్ డివిజన్ అంచనా వేసింది. 2030 నాటికి ఆ సంఖ్య 8.5 బిలియన్లకు, 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి