News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

507views

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది. ఉద్ధవ్ నివాసంలో జరిగిన సమావేశానికి ఇద్దరు ఎంపీలు తప్ప అందరూ హాజరయ్యారు. శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలున్నారు. వీరిలో ఇవాళ్టి సమావేశానికి డుమ్మా కొట్టిన వారిలో భావన, శ్రీకాంత్ షిండే(సీఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు) ఉన్నారు. మెజార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తుండటంతో ఉద్ధవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి