News

రేపు ద్రౌపది ముర్ము నామినేషన్?

433views

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్టు సమాచారం. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలను, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఆహ్వానించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో ఇప్పటికే నిర్ధారించారని తెలుస్తున్నది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి