
415views
కాబూల్: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్ కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించింది.
Source: Nijamtoday





