News

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ

405views

బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ, అవే దీర్ఘకాలంలో దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి’’ అని స్పష్టం చేశారు. ‘స్టార్టప్, ఇన్నోవేషన్‌‌ల దారిలో నడవడం అంత సులభం కాదు. ఈ మార్గంలో దేశాన్ని నడిపించడం కూడా అంత ఈజీ కాదు. పలు నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా చెడ్డవిగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ వాటి ప్రయోజనాలను దేశం అనుభవిస్తుంది’ అని ప్రధాని వివరించారు.

21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి సృష్టికర్తలు, ఆవిష్కర్తలకు చెందినదని, వారే దేశానికి నిజమైన బలమని చెబుతూ ఎనిమిదేండ్లుగా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని ప్రధాని తెలిపారు. సంస్కరణలు మాత్రమే మనల్ని కొత్త లక్ష్యాల వైపు, కొత్త సంకల్పాల వైపు తీసుకెళ్తాయని స్పష్టం చేసారు. దశాబ్దాలుగా అంతరిక్ష, రక్షణ రంగాలకు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, అయితే ఇప్పుడు వాటి తలుపులు తెరిచామని ప్రధాని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి