
404views
ముంబై: మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయం దక్కింది. అసెంబ్లీలో బీజేపీకి ఉన్న బలం ఆధారంగా చూస్తే నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలవగలదు. అయితే, అధికార కూటమి ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా బీజేపీ ఒక స్థానాన్ని అదనంగా గెలుచుకుంది. ఇటీవలనే రాజ్యసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిని ఓడించి, అదనంగా ఓ సీట్ గెలుపొందిన ఉత్సాహంతో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు మరింత బలం కలిగించాయి. మొత్తంగా 10 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగ్గా బీజేపీకి 5, శివసేన నేతృత్వంలోని అధికార కూటమికి 5 స్థానాలు దక్కాయి.
Source: Nijamtoday





