News

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

473views

న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు.

కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న త‌రుణంలో అజిత్ దోవ‌ల్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం మొత్తం గొప్ప మార్పునకు లోన‌వుతోంది. మ‌నం స్ప‌ర్శ ర‌హిత యుద్ధాల వైపు వెళుతున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా అదృశ్య శ‌త్రువుపై యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం సాంకేతిక‌త అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఈ త‌రుణంలో రేప‌టి కోస‌మైనా మ‌నం స‌న్నద్ధం కావాలంటే మార్పుల‌ను అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా న‌డుచు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి