News

వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!

412views

హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళ‌కే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి జ‌స్టిస్ జ‌స్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువ‌రించారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని ఓ ముస్లిం జంట కోర్టును ఆశ్ర‌యించింది. 16 ఏళ్ళ‌ అమ్మాయి, 21 ఏళ్ళ‌ అబ్బాయి పెళ్ళి చేసుకున్నారు. త‌మ కుటుంబ స‌భ్యుల నుంచి ర‌క్ష‌ణ కావాల‌ని కోర్టును ఆశ్రయించారు.

16 ఏళ్ళు నిండిన ముస్లిం మ‌హిళ త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్ళిచేసుకోవ‌చ్చు అని తెలిపింది. ప‌ఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం జంట కోర్టులో కేసు దాఖ‌లు చేసింది. వారిద్దరూ కుటుంబ స‌భ్యుల‌కు వ్య‌తిరేకంగా పెళ్ళి చేసుకున్నార‌ు. వారి ప్రాథ‌మిక హ‌క్కుని కాల‌రాయ‌లేమ‌ని జ‌స్టిస్ జ‌స్‌జిత్ త‌న తీర్పులో తెలిపారు. ఇస్లామిక్ ష‌రియా చ‌ట్టాన్ని త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. ముస్లిం అమ్మాయిల పెళ్ళిళ్ళు ముస్లిం ప‌ర్స‌న‌ల్ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తాయని చెప్పారు. ఆర్టిక‌ల్ 195 ప్ర‌కారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్ళు నిండాయ‌ని, ఆ రూల్ ప్ర‌కారం ఆమె పెళ్ళి చేసుకోవ‌చ్చు.

అబ్బాయి వ‌య‌సు 21 ఏళ్ళు దాటాకా చేసుకోవాలి. ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా కూడా దీన్ని అంగీక‌రిస్తుంద‌ని జ‌డ్జి తెలిపారు. ముస్లిం పర్సనల్‌ లా ప్రకరారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్ళి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ముస్లిం జంట ఈ ఏడాది జూన్ 8వ తేదీన పెళ్ళి చేసుకోగా.. పెద్దలు వ్య‌తిరేకించారు. దీంతో ఆ జంట ఆశ్ర‌యించింది. వారికి కోర్టులో ఊరట లభించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి