దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళను ఎదుర్కొంటోంది: ఆర్.ఎస్.ఎస్. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ

ప్రయాగరాజ్: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళను ఎదుర్కొంటోంది… స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వర్తమానంలోని సవాళ్ళు దాదాపుగా ఒకటే… భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు… వారిని సకాలంలో గుర్తించాలి… కొన్ని రాజకీయ పార్టీలు వారికి బహిరంగ ఆశ్రయం ఇస్తున్నాయి. ఉగ్రవాదులు, రాళ్ళదాడి చేసేవారి సవాళ్ళను కూడా దేశం ఎదుర్కొంటోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ అన్నారు.
నైనిలోని మాధవ జ్ఞాన కేంద్రంలోని ఇంటర్ కళాశాలలో సంఘ ప్రథమ శిక్షావర్గ జరిగింది. ముగింపు ఉత్సవం బుధవారం నిర్వహించారు. రామ్‌కుమార్ వర్మ హాజరై, శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

జాతి ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ అల్లర్లకు కారణమయ్యే శక్తులను గుర్తించి, చెత్తబుట్టలో వేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అస్థిరపరిచే శక్తులు పెరిగిపోతున్నాయి. దేశం సైద్ధాంతిక సవాళ్ళను కూడా ఎదుర్కొంటోంది. అర్బన్ నక్సలైట్లు చాలా క్రమపద్ధతిలో ఇక్కడ జాతీయత, ప్రాచీన సంస్కృతి గురించి గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
భారతీయ సంస్కృతి లేదా హిందూ సంస్కృతి పేరుతో ప్రపంచం మొత్తానికి సుపరిచితమైన సంస్కృతి యొక్క తరగని ప్రవాహం ఇక్కడ ప్రవహిస్తోంది. ఈ సంస్కృతి బిలియన్ల సంవత్సరాల నాటిది. ఈ సంస్కృతి యావత్ దేశాన్ని ఐక్యపరుస్తోంది. ఈ సంస్కృతి ప్రవాహంలో జీవిస్తున్న ప్రజలు దేశ తీర్థయాత్రల పట్ల, గొప్ప వ్యక్తుల పట్ల సమానమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. భారతమాతను తమ తల్లిగా భావిస్తారు. దేశంలో వివిధ సమూహాలుగా జీవించే ప్రజల పూజా విధానం వేరుగా ఉండవచ్చు, కానీ అందరి పూర్వీకులు ఒక్కటే. అందరి పూర్వీకులు హిందువులే. హిందువు జాతీయవాదానికి ప్రతీక అని రామ్‌కుమార్ పేర్కొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఈ దేశం నుంచి హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలను హిందుస్థానీ ముస్లింలు అని కూడా పిలుస్తారని అన్నారు. స్వామి వివేకానందను హిందూ సన్యాసి అని కూడా పిలుస్తారు. అన్ని రకాల అహంకారాలను మరచి, సామాజిక సామరస్యంతో దేశాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లార్డ్ మెకాలే విద్యను విడిచిపెట్టి, దేశభక్తిని కలిగించే విద్యను తీసుకోండి. మొత్తం మానవ సంక్షేమం కోసం హిందుత్వను ప్రచారం చేయండి. భారతదేశం ఐక్యంగా ఉంటుందని, మహర్షి అరవింద్ సంకల్పం నెరవేరుతుందని రామ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలి
ఇక్కడ పొందిన శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రజ్జు భయ్యా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అఖిలేష్ సింగ్ స్వయంసేవకులను కోరారు. సమాజాన్ని కూడా వ్యవస్థీకరించండి, క్రమశిక్షణలో పెట్టండి. నిజమైన శక్తి నాయకత్వంలో కాదు, అతను నడిపించే వ్యక్తుల వద్ద ఉందన్న సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు. సంఘ్‌లో అద్భుతమైన సేవా భావం, క్రమశిక్షణ, అంకితభావం ఉన్నాయని, దీంతోనే దేశం ముందుకు సాగుతుందన్నారు. మెరుగైన వ్యక్తిగా మారడానికి మీ శిక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆకట్టకున్న ప్రదర్శనలు
శిక్షణ పొందిన స్వయంసేవకులు పూర్ణ గణవేష్ ధరించి, ప్రదర్శించిన వివిధ రకాల విన్యాసాలు ఆహుతులను ఆకట్టకున్నాయి. ఈ సందర్భంగా వర్గ కార్యవాహ హరీశ్ మాట్లాడుతూ మూడు విభాగాల్లోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు, రైతులు, వక్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, కార్మికులు వీరిలో ఉన్నారన్నారు.
Source: VSK KASHI





